News

ఎన్నికల బరిలో పివి సింధు


భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు కోసం పోటీపడుతోంది. మార్చి 27న నామినేషన్ల దరఖాస్తు గడువు ముగియగా ఆరుగురు పురుష ఆటగాళ్లు, ముగ్గురు మహిళా క్రీడాకారిణులు ఎన్నికల బరిలో మిగిలారు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధుతో పాటు పురుషుల డబుల్స్‌లో ఇద్దరు మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే భారత్‌ నుంచి అంతగా పేరులేని డబుల్స్‌ ఆటగాడు నిఖర్‌ గార్గ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశాడు. ముంబైకి చెందిన ఈ ఆటగాడు గతేడాది మేలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ సంఘాల ద్వారా కాకుండా నేరుగా రిజిష్టర్‌ చేసుకునే సౌకర్యాన్ని బీడబ్లు్యఎఫ్‌ కల్పించాలని ఆన్‌లైన్‌ పిటిషన్‌ ప్రారంభించాడు.